ఈవీఎంలపై అనుమానాలు – బ్యాలెట్ పద్ధతికి డిమాండ్

రాహుల్ గాంధీ గారు ఇటీవల ఓట్లు చోరీ జరిగిందని, ఇది నిజమని స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంపై ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం అవసరం అని వారు సూచించారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయన పేర్కొన్నట్లుగా, ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతం, పారదర్శకత ఉండకపోవడం మన ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరగడం కోసం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి అని చింతామోహన్ అన్నారు.భారత ఎన్నికల సంఘం ప్రస్తుతంలో అప్రజాస్వామ్యంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దేశంలో ఎన్నికల ప్రక్రియను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఇది వైఫల్యాన్ని చూపుతోంది అని విమర్శించారు.
ముందు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉండేవారు అని. దీని వల్ల ఎన్నికల పై ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సెలక్షన్ కమిటీలో ఉండకపోవడం పెద్ద లోపంగా ఉంది.ఎలక్షన్ కమిటీ కోసం స్క్రీనింగ్ కమిటీ నలుగురు పేర్లను నామమాత్రంగా ప్రతిపాదించి, అందులో వారి ఇష్టమైన ఒకరిని ఎంపిక చేస్తోంది. ఇది కూడా ఎన్నికల పారదర్శకతపై అనుమానాలను కలిగిస్తోంది అన్నారు చింత మోహన్.
అమెరికా వంటి కొన్ని పెద్ద దేశాల్లో అన్ని ఎన్నికలు ఒకే రోజున జరుగుతాయి. కానీ మన దేశంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి, తమకు అనుకూలమైన తేదీల్లోనే ఎన్నికలను నిర్వహిస్తోంది. 6–7 దశల్లో పోలింగ్ నిర్వహించడం, పోలింగ్ తేదీ మరియు కౌంటింగ్ మధ్య నెల రోజుల వ్యత్యాసం ఉండడం అనేక అనుమానాలకు దారితీస్తుంది అని విమర్శించారు.అలాగే, ఓటర్ లిస్ట్‌లలో చనిపోయిన వారిని కూడా తీసేయకపోవడం ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తోంది. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నందున, కొన్ని వర్గాలు ఇంకా బ్యాలెట్ పద్ధతిని మంచిది గా భావిస్తున్నారు.ఎలక్షన్ కమిటీ సభ్యులను ఎంపిక చేయడంలో ప్రధానమంత్రి, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత, మరియు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురి సమితి ఆధారంగా చేయబడితే, మరింత న్యాయం, విశ్వాసం పెరుగుతుంది.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీపై చేసిన విమర్శలు, కొంత అర్థరహితంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయంగా ఎదిగిన కిరణ్, బీజేపీ దృష్టిలో నిలవడానికి రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు అని చింత మోహన్ విమర్శించారు.
-
Home
-
Menu