అనుమతులు లేని యూనివర్సిటీ.. విద్యార్థులపై తీవ్ర అన్యాయం– షర్మిల ఆగ్రహం

YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సంఘీభావంగా, వారి భవిష్యత్‌పై తన ఆవేదనను వ్యక్తపరిచారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి.
2020లో స్థాపించబడిన ఈ యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) నుంచి అనుమతులు లేకుండానే విద్యార్థులను తీసుకున్నారు. ఇది విద్యార్థుల జీవితాలతో చేసిన ఘోరమైన అన్యాయం. ఇప్పటికీ తొలి బ్యాచ్‌కు పూర్తిస్థాయి ఎన్రోల్‌మెంట్ జరగలేదు. అనంతర మూడు సంవత్సరాల విద్యార్థులకూ ఇదే పరిస్థితి.ఒక్కో విద్యార్థి సుమారుగా ₹15 లక్షల ఖర్చు పెట్టారుఅన్నారు.ఐదేళ్ల పాటు శ్రమించి కోర్సు పూర్తిచేసిన తర్వాత, వారికి సర్టిఫికేట్ వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి అని,ఇది విద్యార్థుల మీద చేసిన తీరని తప్పిదం గా ఈ వ్యవస్థ పూర్తిగా అనార్గనైజ్డ్‌గా మారిపోయింది విమర్శించారు షర్మిల.
అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందిఅన్నారు,నియోజకవర్గానికి చెందిన ఎంపీగా అవినాష్ రెడ్డి COA అనుమతుల కోసం పోరాడాల్సింది అని వివరించారు.దిల్లీలో ఉన్న COA తో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదు అని,అనుమతులు లేవని తెలిసినా ఎందుకు మౌనం ఉన్నారో వీరికే తెలియాలి అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకపోవడం బాధాకరం అని విచారం వ్యక్తం చేసారు ఏపీసీసీ చీఫ్ షర్మిల.
ఇప్పటి కూటమి ప్రభుత్వం (టిడిపి – జనసేన – బీజేపీ) అధికారంలో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు వారి మీద ఉందిఅన్నారు.విద్యార్థులు ఏడాదిగా పోరాడుతున్నారు అని COA అనుమతుల కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు,విద్యార్థులకు సరైన సర్టిఫికెట్లు రాకపోతే వారి జీవితాలు దెబ్బతింటాయి అని విచారం వ్యక్తం చేసారు షర్మిల.
2020–2022 మధ్య చేరిన విద్యార్థులకు COA అనుమతులు వెంటనే తీసుకొచ్చాలి.విద్యార్థులకు పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్, వాలిడ్ డిగ్రీలు ఇవ్వాలి అని షర్మిల డిమాండ్ చేసారు.YSR యూనివర్సిటీ పేరు మార్చడం కాదు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని భావించాలి హితవు పలికారు.మీరు పేరు మార్పులు చేయండి గానీ… విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి కలలను, భవిష్యత్తును పాడుచేయవద్దు అన్నారు వైస్ షర్మిల రెడ్డి.
-
Home
-
Menu