ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు - సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (జూలై 17) ఢిల్లీ నుండి కర్నూలు జిల్లాకు ప్రత్యేక పర్యటనపై బయలుదేరుతున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుండి విమానములో నేరుగా కర్నూల్ వెళ్లనున్నారు.
ఈ రోజు ఆయన పర్యటనలో ప్రధాన కార్యక్రమంగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామానికి చేరుకొని,అక్కడ మల్యాల వద్ద రెండు మోటార్లను మధ్యాహ్నం 1 గంటకు ఆన్ చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ఈ సందర్భంగా ఆయన రైతులతో మధ్యాహ్నం 2:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు అందించనున్న ప్రయోజనాలపై ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది.
ఈ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధిపై తన దృష్టిని, సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు. భారీ సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతారని అంచనా.
-
Home
-
Menu