అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనకు రూపకల్పన

అమరావతిలో  క్వాంటం వ్యాలీ స్థాపనకు రూపకల్పన
X
క్వాంటం టెక్నాలజీ పై ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్ విశ్లేషణ

విజయవాడ- అమరావతి క్వాంటం వ్యాలీ స్థాపనకు రూపకల్పన చేస్తున్నారు,క్వాంటం టెక్నాలజీ పై ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్ , నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు, టీసీఎస్ సలహాదారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లు పరిశోధన సాగిస్తున్నాయి అన్నారు.ఐటీ దిగ్గజ కంపెనీలు అయిన ఐబీఎం, గూగుల్ లాంటి సంస్థలు కూడా క్వాంటం కంప్యూటర్లను రూపోందించి, పరిశోధన సాగిస్తున్నాయి అన్నారు.

ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు , బిన్ ప్యాకింగ్ , కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్ , ఇమేజ్ క్లాసిఫికేషన్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని వినియోగం చేయొచ్చు,ఇవేకాక స్టాక్ మార్కెట్ , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తృత సేవలు అందిస్తోంది.

1000 క్యూబిట్ కంప్యూటర్ ఇప్పుడు నిన్నటి తరంగా మారిపోయింది,ప్రస్తుతం కంప్యూటింగ్ నెట్వర్క్ భద్రత, పాస్ వర్డ్ ల సెక్యూరిటీల కోసం కేంద్రం ఖ్విలా ప్రాజెక్టు అమలు చేస్తోంది. నేషనల్ క్వాంటం మిషన్ లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతోంది.ఇది విద్య సంస్థలతో పాటు పరిశ్రమలకు ప్రయోజనకారిగా మారుతుంది.రాజధాని అమరావతి లో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ సెంటర్ దేశానికి ఓ దిక్చూచిగా మారుతుంది అని తెలిపారు నేషనల్ క్యాంటం మిషన్ సభ్యుడు టీసీఎస్ సలహాదారు అనిల్ ప్రభాకర్ .

Tags

Next Story