పాశమైలారం ఘోర ప్రమాదం పై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పాశమైలారం సమీపంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవ్వడంతో అక్కడ ఉంటున్న ప్రజలకు తీవ్రగాయాలు,ఆస్థి నష్టం వాటిలింది.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా,16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి సంబంధించి స్థానిక స్థాయిలో సహాయక చర్యలు ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లతో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, సీఎం డీజీపీ, ప్రధాన కార్యదర్శి (CS)లతో సమీక్ష నిర్వహించారు.ప్రమాదంలో చిక్కుకున్న వారికి సహాయపడేందుకు అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి సీఎస్ రామకృష్ణారావు నాయకత్వం వహించనున్నారు. ఇందులో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీ సభ్యులుగా ఉండనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అవసరమైన సిఫారసులను చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (జూలై 1) ఉదయం 10 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించనున్నారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు తెలుపనున్నారు. సహాయక చర్యల పురోగతిపై సమీక్షించనున్నారు.
-
Home
-
Menu