వాతావరణం ప్రభావంతో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

వాతావరణం ప్రభావంతో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
X
ప్రమాద నివారణలో పైలట్ అప్రమత్తత – సీఎం ప్రయాణానికి తాత్కాలిక మార్పులు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్‌ అప్రమత్తతతో సమయోచితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

హెలికాప్టర్ మార్గం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో, సీఎం గన్నవరం నుంచి ప్రత్యక్ష విమానంలో రాజమండ్రికి చేరుకున్నారు.రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లి చేరుకోనున్నారు. సీఎం భద్రతా బలగాలు, అధికారులు ఇప్పటికే మలకపల్లిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags

Next Story