రేపు జరగబోవు యాంటీ నార్కోటిక్ డే కు సీఎం చంద్రబాబు హాజరు

రేపు జరగబోవు యాంటీ నార్కోటిక్ డే కు సీఎం చంద్రబాబు హాజరు
X
గుంటూరు పర్యటనలో యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా యువతతో చంద్రబాబు ర్యాలీ

రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రస్తుతం గుంటూరు పర్యటనలో ఉన్నారు.26,27 గుంటూరు లో ముఖ్య మంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా రేపు జరగబోవు యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు.

శ్రీ కన్వెన్షన్ లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగం పై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుంది.

మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి పై ఈ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది అని,గంజాయిని ఈ రాష్ట్రము నుంచి పూర్తిగా తరిమేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది అని వెల్లడించారు.

ఈగిల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా,వాడకం అడ్డుకుంటున్నాం అని,రేపు సీఎం చంద్రబాబు యువత ఉద్దెశించి మాట్లాడతారు అన్నారు.రేపు గుంటూరు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం అని తెలియ చేసారు.

Tags

Next Story