కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ మృతులు సంఖ్య 500 పైన

కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ మృతులు సంఖ్య 500 పైన
X
ఆగస్టు 14న చొసిటీ గ్రామం వద్ద మచైల్ మాతా యాత్ర మార్గంలో భారీ వర్షం కారణంగా వరదలు ముంచెత్తాయి.

జమ్మూ–కశ్మీర్‌లోని కిష్త్ వాడ్ జిల్లాలో ఆగస్టు 14వ తేదీ ఉదయం భారీ క్లౌడ్‌బస్ట్ సంభవించింది. చొసిటీ గ్రామం వద్ద జరిగిన ఈ ఘటన మచైల్ మాతా యాత్ర మార్గంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా భారీ వరదలు వచ్చి గ్రామం మొత్తాన్ని ముంచెత్తాయి. ఈ విపత్తులో అనేక ఇళ్లు, గుడారాలు, లంగర్‌లు మరియు యాత్రికుల వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.

తాజా సమాచారం ప్రకారం కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా 250 మందికి పైగా కనిపించడం లేదు. అధికారులు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు మరియు రక్షించేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ రక్షణ చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, పోలీసులు, మరియు స్థానిక స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరియు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫరూక్ అబ్దుల్లా ప్రకారం, 500 మందికి పైగా గల్లంతయ్యే అవకాశం ఉందని, ఆ సంఖ్య 1000 వరకు చేరవచ్చని తెలిపారు.

ఈ విపత్తు కారణంగా స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన జమ్మూ–కశ్మీర్‌లోని అన్ని కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా "At Home" కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. మచైల్ మాతా యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు

Tags

Next Story