మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు పోలీస్ కస్టడీ

మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు పోలీస్ కస్టడీ
X
వైఎస్సార్ నేతలపై కేసు తీవ్రం – రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం

మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు పోలీసులు కస్టడీ కోరిన అభ్యర్థనపై ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో ఇద్దరినీ మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది.

ఈ మేరకు జూన్ 1 నుంచి జులై 3 వరకూ భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడును పోలీసులు విచారించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారిని ప్రశ్నించే అవకాశం పోలీసులకు కల్పించింది కోర్టు.

అంతేకాకుండా, పోలీస్ కస్టడీలో ఉండగా బయట నుండి తాను తినేందుకు ఆహారం తెచ్చుకునేందుకు అనుమతించాలంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన వేసిన ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story