రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే వదిలేది లేదన్న చంద్రబాబు

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే వదిలేది లేదన్న చంద్రబాబు
X
సుపరిపాలన తొలి అడుగు సభలో సీఎం చంద్రబాబు వార్నింగ్

నిన్న రాత్రి (జూన్ 23) అమరావతిలో సుపరిపాలన తొలిఅడుగు సభనిర్వహించారు,ఏపీ లో కూటమి ప్రభుత్వం ఎర్పడి సంవత్సరం అయిన సందర్భంగా భారీ సభ నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ కింద ఉమ్మడి మ్యానిఫెస్టో ఇచ్చామని, ప్రజలు కూటమిపై అభిమానంతో గెలిపించారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ సంవత్సర కాలంలో చేసి చూపించాం అన్నారు.కేంద్రం ఆదుకోకపోతే ఆంధ్రరాష్ట్రం లో అభివృద్ధి చేయలేము అన్నారు.

అరాచక శక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుతూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ,ఆ దిశగా తొలిఅడుగు వేసింది అన్నారు. 1994లో జీతాలివ్వలేని స్దితిలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించాను అని గుర్తు చేసారు.2014 లో విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు,రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్వాలు చేశాను అని చెప్పారు.సీఎం పదవి తనకు కొత్త కాదని, ఇంత కంటే క్లిష్టమైన సందర్భాల్లో తాను పనిచేశానన్నారు.

గత వైసీపీ పాలనలో దుష్పరిపాలన నుంచి జనం భారీ మెజార్టీతో అధికారం ఇచ్చేవరకూ రాష్ట్రం ఎలాంటి పరిపాలన జరిగిందో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.గత వైసీపీ పాలనలో సోలార్, పవన విద్యుత్ పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారన్నారు.రాష్ట్రంలో నిధులు భారీగా దుర్వినియోగం చేయడం, మళ్లించడం వంటి అక్రమాలు చేశారన్నారు.ఇబ్బందులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపొగ పూర్తిగా నాశనం చేసారు అని విమర్శించారు.

ఒక్కపార్టీ తో ఏర్పడే ప్రభుత్వం కాదు ఇది అన్నారు,NDA కూటమి లో ఎప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా పవన్ కళ్యాణ్ ,బీజేపీ పార్టీలు అభివృద్ధి దిశగానే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు వారికీ కృతజ్ఞత తెలియచేసారు.ఎన్ని అడ్డంకులు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటనిలబెట్టుకుంటుంది అని,ఆ దిశగానే ముందుకు పోతుంది అని,దీనికి ప్రజా ప్రతినిదులు కూడా సహాయసహకారాలు అందిచాలి అని చెప్పారు.

Tags

Next Story