జమ్మూ-కాశ్మీర్ పునర్విభజనపై కేంద్రం నూతన పాలసీ?

జమ్మూ-కాశ్మీర్ పునర్విభజనపై కేంద్రం నూతన పాలసీ?
X
జమ్మూను రాష్ట్రంగా, కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే యోచన ఉందా?

కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ అంశంపై మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కొన్ని వర్గాల్లో ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి. జమ్మూ-కశ్మీర్‌ను మరోసారి పునర్విభజన చేసి, జమ్మూను ప్రత్యేక రాష్ట్రంగా మారుస్తూ, కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఈ పరిణామాల మధ్య బీజేపీ కీలక నేత, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రామ్ మాధవ్‌ను జమ్మూ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించే అవకాశముందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న పునర్విభజనలో, జమ్మూ ప్రాంత ప్రజలకు పరిపూర్ణ స్వీయపాలన కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ వార్తలన్నీ ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించబడలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ విషయంపై స్పందిస్తూ – ఎటువంటి మంచి కానీ, చెడు కానీ జరగదు, ప్రజలు అపోహలకులోనవ్వకూడదు,” అని వ్యాఖ్యానించారు.

ఇలాంటి కీలక విషయాల్లో సరిగ్గా నిజాంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే, అది చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. పార్లమెంటు చర్చ, రాజ్యాంగ పరిష్కారాలతోనే అటువంటి మార్పులు సాధ్యమవుతాయి.

Tags

Next Story