జలవివాదాలపై కేంద్రం నెలరోజుల్లో నివేదిక

జలవివాదాలపై కేంద్రం  నెలరోజుల్లో నివేదిక
X
జలవివాద పరిష్కారానికి చరిత్రాత్మక అడుగు – ఢిల్లీలో రాష్ట్రాల మధ్య కీలక సమావేశం

ఢిల్లీలో ఈ రోజు(జులై 16) జరిగిన కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారి సమక్షంలో జరిగిన సమావేశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలాల వినియోగం విషయంలో కీలకంగా నిలిచింది. కృష్ణా – గోదావరి నదీ జలాల పర్యవేక్షణకు టెలిమెట్రీ విధానంను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కార దిశగా ఒక తొలి అడుగు కావడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి విజయంగా నిలిచిందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు.

ఇప్పటి వరకు నదీ జలాల వినియోగంపై ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగిస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల అభ్యంతరాలు ఏర్పడేవి. ఇప్పుడు అన్ని కీలక పాయింట్ల వద్ద టెలిమెట్రీ పరికరాలు అమలు చేయనుండటం వల్ల నీటి వినియోగంపై నిజమైన సమాచారం అందుబాటులోకి రానుంది తెలియచేసారు రేవంత్.

రాష్ట్ర విభజన చట్టంలోని ప్రకారం, గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణ నుంచి, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేయాలని అంగీకారం కుదిరింది అన్నారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్ పూల్ తదితర మరమ్మతులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించినట్టు తెలిపారు సీఎం.ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వినియోగం, ప్రాజెక్టులు, అభ్యంతరాలపై అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పించనుంది అన్నారు.

రాయలసీమకి వరంగా భావించే గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర సంస్థలు అభ్యంతరాలు తెలుపగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమావేశంలో తన ఇష్టాన్ని పూర్తిగా వెల్లడించ లేకపోయింది అన్నారు,, తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాన్ని స్పష్టంగా వెల్లడించింది అన్నారు సీఎం రేవంత్.

ఈ సమావేశం ద్వారా గత 10 ఏళ్లుగా పరిష్కారం లేని జలవివాదాలపై స్పష్టత వచ్చింది. టెలిమెట్రీ విధానం అమలు, ప్రాజెక్టుల భద్రతపై నిర్ణయాలు, ఇరు రాష్ట్రాల సహకారంతో సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం ఈ చరిత్రాత్మక సమావేశాన్ని ప్రత్యేకంగా నిలిపాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన హక్కుల పరిరక్షణలో, పారదర్శకత కోసం టెలిమెట్రీ విధానాన్ని గట్టి పట్టుదలతో సాధించింది. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags

Next Story