ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ గేమ్‌ప్లాన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, రైతుల సమస్యలే తమ పార్టీకి పెద్ద ప్రాధాన్యం అన్నారు. మా దగ్గర నలుగురు ఎంపీలు ఉన్నారు. సెప్టెంబర్ 9లోపు తెలంగాణ రైతులకు 2 లక్షల టన్నుల యూరియా ఇస్తామన్న హామీ ఎవరు ఇస్తారో, వాళ్లకే మేము మద్దతు ఇస్తాం అని తెలిపారు.
ఒక జర్నలిస్ట్, కేంద్రం ఇప్పటికే యూరియా ఇచ్చిందని చెప్పగానే, కేటీఆర్ వెంటనే, ఇప్పటివరకు ఇచ్చింది సరిపోదు, ఇంకా 2 లక్షల టన్నులు కావాలి. అది మోదీ గారు ఇస్తారా, రాహుల్ గాంధీ గారు ఇస్తారా అన్నది ముఖ్యం కాదు. రైతుల డిమాండ్ తీర్చగలిగిన వాళ్లతో మేముంటాం అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో NDA తరఫున తమిళనాడుకు చెందిన సీ.పి. రాధాకృష్ణన్ పోటీ చేస్తుంటే, ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి తరఫున తెలంగాణకు చెందిన బి. సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ సీఎం, తెలుగు నాయకులంతా రాజకీయాలు పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.
రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్, ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. దానికి కారణం యూరియా సమస్యను వెంటనే పరిష్కరించగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే ఉంది. కానీ, కేంద్రం చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఓటింగ్‌లో దూరంగా ఉండొచ్చు లేదా తెలంగాణ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని సమర్థించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేటీఆర్ ఇంతకుముందు రాహుల్ గాంధీకి “వోటు చోరీ” క్యాంపైన్‌కి బలంగా మద్దతు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఎవరి పక్షం ఉంటారో అనేది చివరి నిమిషం వరకు ఓపెన్‌గా చెప్పకుండా జాగ్రత్తగా పడుతున్నారు అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
-
Home
-
Menu