బతుకమ్మకుంట పునరుజ్జీవనం – హైదరాబాద్‌కు ఒక హరిత శుభవార్త

బతుకమ్మకుంట పునరుజ్జీవనం – హైదరాబాద్‌కు ఒక హరిత శుభవార్త
X
హైదరాబాద్ చెరువుల పునరుజ్జీవనానికి HYDRAA నుండి బలమైన ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బతుకమ్మకుంట చెరువు,సుమారు 5 ఎకరాలు ఇప్పుడు కొత్తగా మేలు మార్గంలోకి వచ్చేస్తోంది. పలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై ఉన్న ఈ చెరువు, HYDRAA (Hyderabad District River Adoption and Awareness) సంస్థ ఆధ్వర్యంలో, కమీషనర్ శ్రీ రంగనాథ్, ఐపీఎస్ గారి చొరవతో పునరుజ్జీవన పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో HYDRAA ప్రారంభించిన పునరుద్ధరణ పనులు ముందు, చెరువు తీవ్రంగా కాలుష్యానికి, ఆక్రమణలకు గురై చిగురించలేని స్థితిలో ఉండేది. అయితే జూలై 7న తీసిన పైభాగం (ఎరియల్) చిత్రాల్లో, చెరువు పూర్తిగా శుభ్రంగా మారి, పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 7 నుండి 8 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సెప్టెంబర్ 2025 నాటికి పూర్తిగా పనులు ముగించాలన్న లక్ష్యంతో, HYDRAA బృందం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇది కేవలం చెరువు పునరుద్ధరణకే కాకుండా, హైదరాబాద్ నగరంలోని జలవనరుల పునః స్థాపనకు ప్రేరణగా నిలుస్తోంది.

స్థానికులు ఈ కార్యక్రమంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. HYDRAA దృష్టి, వేగవంతమైన అమలు, అలాగే కమీషనర్ రంగనాథ్ గారి శక్తివంతమైన నాయకత్వం ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ఇది సుస్థిర పట్టణాభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ అభివృద్ధికి HYDRAA మరియు రంగనాథ్ సర్ గారికే మొత్తం కృతజ్ఞతలు దక్కుతాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, నగరంలోని పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించేందుకు అందించిన మద్దతుకు ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ పునరుజ్జీవన యత్నం, కేవలం ఒక చెరువును పునఃసృష్టించడమే కాదు — సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా హైదరాబాద్ నగరం తీసుకుంటున్న భద్రతా బాటలో ఇది ఒక గొప్ప అడుగు భావిస్తునానరు.

Tags

Next Story