పులివెందుల తీర్పుపై బాలయ్య

పులివెందుల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్త అధ్యాయం రాసింది అని టీడీపీ అధికారులు అంటున్నారు.జగన్ కోట కూల్చేసి, టీడీపీ జెండా ఎగర వేయటం చరిత్రలో గొప్ప విజయంగా భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి లత, జెడ్పీటీసీ ఎన్నికల్లో 6 వేలకుపైగా మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌కుమార్ రెడ్డికి డిపాజిట్లు కూడా రాకపోవడం, ప్రతిపక్ష పార్టీకి గట్టి చెంపదెబ్బగా మారింది. ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబు స్వయంగా లతకు శుభాకాంక్షలు తెలిపారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, "ఇప్పటి వరకు భయానికి బానిసలైన పులివెందుల ప్రజలు, ఈసారి స్వేచ్ఛా గాలి పిలుచుకుంటారు, భయపడని ఓటు బలమే ఈ ఫలితం అని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యల వల్ల ఎక్కువ మంది ఓటు హక్కుని వినియోగించుకొన్నారు అని, ఈ విజయానికి ప్రతి కార్యకర్తే యజమాని అని బాలకృష్ణ పేర్కొన్నారు.
మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి సవితలు మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కును అడ్డుకునే కుట్రలను ప్రజలే తిప్పికొట్టారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్య దీపం వెలిగింది అని అన్నారు. మంత్రి మండపల్లి రాం ప్రసాద్ రెడ్డి, ఎన్నికలు న్యాయంగా జరిగితే టీడీపీదే గెలుపు అని స్పష్టం చేశారు.
బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలకన్నా గొప్పవారు లేరు. పులివెందుల తీర్పు జగన్ అహంకారానికి గట్టి హెచ్చరిక. ఇకనైనా ప్రజలను గౌరవించాలి. లేకపోతే పార్టీ మూసేసి ఇంటికే పరిమితం కావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
Home
-
Menu