ఆగస్టు 14,పదహారు ఏళ్ల కుర్రాడి తొలి శతకం

90’s కాలం క్రికెట్ అభిమానులకు సచిన్ పేరు ఒక మాయ. క్రీజ్‌లో సచిన్ ఉన్నాడంటే జట్టువాళ్లు, అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకునేవారు. ప్రత్యర్థి జట్లు మాత్రం టెన్షన్‌లో ఉండేవి. అప్పటి టీవీ, రేడియో కమెంటరీలో మాస్టర్ బ్లాస్టర్, “క్రికెట్ గాడ్” అని పిలవబడిన సచిన్ టెండూల్కర్ 1989 ఆగస్టు 14న తన టెస్ట్ శతకాల ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అదే ఆయన చరిత్ర సృష్టించే ‘100’ శతకాల మొదటి అడుగు పడింది.
16 ఏళ్ల చిన్న వయసులో లండన్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టిన సచిన్, మాంచెస్టర్ టెస్టులో తన తొలి శతకం సాధించాడు. టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసినా, ఆ శతకం సచిన్ కెరీర్‌లో పెద్ద మలుపు. ఆ మ్యాచ్ నుంచి ఆయన దాదాపు 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచానికి ప్రేరణగా నిలిచారు. సచిన్ బ్యాటింగ్‌పై అప్పట్లో ప్రతి ఆటగాడు ప్రశంసలు కురిపించేవారు.ఆ టూర్‌లో మూడో టెస్ట్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 519 పరుగులు చేసింది. గ్రాహం గూచ్, మైక్ అథర్స్, రాబిన్ స్మిత్‌లు శతకాలు చేసారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు మాత్రమే చేసింది. అజరుద్దీన్ (93), సచిన్ (68) సహకారంతో రెండో ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. ఫాలోఆన్‌లోకి వెళ్లిన ఇంగ్లాండ్ 320/4 వద్ద డిక్లేర్ చేసింది.408 పరుగుల లక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ టాప్ ఆర్డర్ త్వరగా ఔటైంది. నవజోత్ సిధూ (0), కపిల్ దేవ్ (12) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ సమయంలో సచిన్ అద్భుతంగా ఆడి జట్టును కాపాడాడు. 189 బంతుల్లో 119 నాటౌట్ చేసి, మాన్రమ్, చెమింగ్స్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భారత్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 343 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆ తరువాత సచిన్ టెండూల్కర్ 24 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ దీర్ఘకాల ప్రయాణంలో మొత్తం 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు సాధించాడు. ఆయన బ్యాటింగ్ ప్రతిభను చూపించే గణాంకాలలో 100 శతకాలు, 164 అర్థశతకాలు ప్రత్యేకమైనవి.టెస్ట్ క్రికెట్‌లో సచిన్ 200 మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఆయన 51 శతకాలు ద్వారా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.వన్డే క్రికెట్‌లో ఆయన 463 మ్యాచ్‌లు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 శతకాలు ఉండడం ఆయన స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం.
అంతర్జాతీయ T20ల్లో కూడా సచిన్ తన ముద్ర వేసి, 10 మ్యాచ్‌లు ఆడాడు.అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో వంద శతకాలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్. 2013లో ఆయన క్రికెట్‌కు వీడ్కోలు పలికి, అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించాడు.
-
Home
-
Menu