అమెరికా టెస్లా కార్ మోడల్ Y భారత మార్కెట్‌లో విడుదల

ప్రపంచ ప్రఖ్యాత అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, జూలై 15న అధికారికంగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తొలి రిటైల్ షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా, తన ప్రముఖ ఎలక్ట్రిక్ SUV మోడల్ అయిన మోడల్ l Yను విడుదల చేసింది.
మోడల్ Y ప్రారంభ ధరను రూ. 59.89 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. దీన్ని కేవలం రియర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని లాంగ్ రేంజ్ RWD వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా ఉందిప్రారంభ దశలో ఈ వాహనం కేవలం ముంబయి, ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల్లోనే లభ్యం కానుంది. డెలివరీలు 2025 క్యాలెండర్ సంవత్సరంలో మూడో త్రైమాసికం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
భారత మార్కెట్లో మోడల్ Y ధరలు ఇతర దేశాలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి.అమెరికాలో మోడల్ Y ధర: రూ. 38.6 లక్షలు ఉండగా ,చైనాలో ధర రూ. 30.5 లక్షలు (263,500 యువాన్) అదే జర్మనీలో అయితే Y ధర రూ. 46 లక్షలు (€45,970) గా ఉంది.ఈ దేశాలతో పోలిస్తే భారత్ లో దీని ధర చాల ఎక్కువ అనే చెప్పాలి.
కంపెనీ ప్రస్తుతానికి చైనా ఫ్యాక్టరీలో తయారైన కార్లను భారతదేశానికి దిగుమతి చేస్తోంది. భారతదేశంలో ఉన్న అధిక దిగుమతి సుంకాలు (70% వరకు), లాజిస్టిక్స్ ఖర్చుల వల్లే ధరలు ఇంత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
భారత మార్కెట్‌లో Model Y రెండు బ్యాటరీ వేరియంట్లలో లభించనుంది,60 kWh బ్యాటరీ WLTP రేంజ్ 500 కిలోమీటర్లు మరియు 75 kWh (లాంగ్ రేంజ్) WLTP రేంజ్ 622 కిలోమీటర్లు ఇస్తుంది అని కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం భారత్ లో ఉన్న జర్మన్ లగ్జరీ కంపెనీలైన BMW, మెర్సిడెస్ వంటివారి ఎంట్రీ లెవెల్ EV మోడళ్లతో టెస్లా Model Y పోటీ పడనుంది.ఇటీవలే టెస్లా ఇండియా, ముంబయిలో లొధా లాజిస్టిక్స్ పార్క్‌లో 24,565 చదరపు అడుగుల గోదాంను 5 సంవత్సరాలకు లీజ్కు తీసుకుంది టెస్లా. భారత్‌లో తయారీ కాకుండా, షోరూములు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతోంది టెస్లా కంపెనీ.
విదేశీ కార్ల నిబంధనల్లో సడలింపు లేదు అని కామర్స్ & ఇండస్ట్రీ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.భారతదేశం టెస్లా కోసం ప్రత్యేకంగా విధానాలను మార్చదని, ప్రపంచంలోని అన్ని ఈవీ తయారీదారులను ఆకర్షించేలా నిబంధనలు రూపొందిస్తామని వెల్లడించారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త EV పాలసీకి టెస్లా ఆసక్తి చూపించకపోవడంతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు.
-
Home
-
Menu