ఎయిర్ ఇండియా ఇంజిన్ ఫెయిల్యూర్‌కు సాంకేతిక లోపం కాదు – AAIB స్పష్టీకరణ

ఎయిర్ ఇండియా ఇంజిన్ ఫెయిల్యూర్‌కు సాంకేతిక లోపం కాదు – AAIB స్పష్టీకరణ
X
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణం: AAIB నివేదిక

అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేక్ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే కూలిపోయిన విష్యం ప్రపంచాన్ని శోకసంద్రం లో ముంచెత్తిన్ది,దీనికి కారణం పైలట్ల తప్పిదమే అని AAIB(భారత విమాన ప్రమాదాల అన్వేషణ శాఖ) ఒక నిర్ధానకు వచ్చినట్టు తెలుస్తుంది.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను ఒకేసారి "RUN" నుండి "CUTOFF" స్థితికి మార్చడంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఘోరంగా కుప్పకూలింది. ఈ సంఘటనపై భారత విమాన ప్రమాదాల అన్వేషణ శాఖ (AAIB) విడుదల చేసిన 15 పేజీల ప్రాథమిక నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రారంభ రన్‌వే నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే పైలట్లిద్దరు ఉన్న కాక్‌పిట్‌లో ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రెండు అనూహ్యంగా CUTOFF స్థితికి మార్చబడ్డాయి. దీంతో రెండు ఇంజిన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈ పరిస్థితిలో విమానానికి శక్తి పోయింది. విమానం గాలిలో స్థిరంగా లేకుండా పోయింది. Ram Air Turbine (RAT) ఆటోమేటిక్‌గా డిప్లాయ్ కావడం వలన తాత్కాలిక శక్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. పైలట్లు స్విచ్‌లను మళ్లీ RUN స్థితికి మార్చినా, ఇంజిన్లు మళ్లీ సజావుగా పనిచేయలేదు.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం, ఒక పైలట్ ఇలా ప్రశ్నించాడు –"ఎందుకు కట్ చేసావ్?"

దానికి మరో పైలట్ బదులుగా –"నేను కట్ చేయలేదు!" అని అన్నట్లు తెలుస్తోంది.ఈ మాటల ద్వారా పైలట్ల మధ్య కమ్యూనికేషన్ లోపం లేదా తప్పుడు పని చేయబడిన అవకాశాన్ని నివేదిక స్పష్టంగా చూపిస్తోంది.

AAIB నివేదిక ప్రకారం, ఇంజిన్ ఫెయిల్యూర్‌కు ఏ విధమైన సాంకేతిక లోపం లేదని నిర్ధారణ అయింది. పైలట్ల అవగాహన లోపం, లేదా ఆపరేషన్ ప్రొసీజర్‌లో లోపం వలన ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ఎటువంటి అలారమ్‌లు లేదా హెచ్చరికలు కూడా నమోదు కాలేదు.

ఇంజిన్‌లు ఆగిపోవడంతో విమానం నేరుగా అహ్మదాబాద్ విమానాశ్రయ పరిధిలోని గోడ దాటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు, అందులో 241 మంది ప్రయాణికులు, 19 మంది భూమిపై ఉన్నవారు ఉన్నారు. ఇది దేశ విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనలలో ఒకటిగా నిలిచింది.

AAIB ఇప్పటికే 15 పేజీల ప్రాథమిక నివేదికను భట్టి,పూర్తిస్థాయి దర్యాప్తు తరువాత, పైలట్ల శిక్షణ విధానాలు,మానవ తప్పిదం దారి తీసే వ్యవస్థల లోపాలు మరియు ఎయిర్ ఇండియా ఆపరేషన్ ప్రోటోకాల్ లోపాలు ఉన్నాయా అనే దానిపై విచారణలో తేలనుంది.

ఈ ప్రమాదం భారత వైమానిక రంగానికి తీవ్ర హెచ్చరికగా భావించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పైలట్లకు ఆధునిక శిక్షణ మరియు స్పష్టమైన ఆపరేషన్ మార్గదర్శకాలు వంటి వ్యవస్థలపై కఠిన నియంత్రణలు, అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యవస్థల స్పందనను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

విమాన భద్రత విషయంలో దేశం మరింత నిఖార్సైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని విమాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story