ఏకగ్రీవంగా ఎన్నికైన ACA కొత్త కమిటీ

విజయవాడలో జరిగిన ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ (ACA) ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి పదవీకాలం మూడు సంవత్సరాలు (2025 నుంచి 2028 వరకు)గా నిర్ణయించారు..ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్నీ) ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎంపీ సానా సతీష్ కార్యదర్శిగా నియమితులయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, కౌన్సిలర్‌తో కలిపి మొత్తం 34 మంది కొత్త కమిటీ ఏర్పడింది. ఈ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరిగాయి.
కొత్త కమిటీ ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టబోతుంది. ప్రతి జిల్లాలో స్టేడియాలు నిర్మించడం, ఆటగాళ్లకు మంచి అవకాశాలు కల్పించడం, పెద్దస్థాయి పోటీల నిర్వహణను ప్రధాన ప్రాధాన్యంగా తీసుకున్నారు.విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో త్వరలో జరిగే ICC మహిళల ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అదనంగా ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కూడా అక్కడ జరగనుంది.
రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మించడానికి ఏసీఏ(ACA) ప్రణాళిక వేసింది. మొదట కర్నూలు, నెల్లూరు జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ప్రతి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్లు, శిక్షణా శిబిరాలు తరచుగా నిర్వహించాలని నిర్ణయించారు.రాజధాని అమరావతిలో ఒక లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే స్థాయి ఉన్న భారీ అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని ఏసీఏ కోరింది.
జిల్లా క్రికెట్ సంఘాలకు ఏటా 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు నిధులు ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 200 రోజుల క్రికెట్ కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.మొత్తంగా కొత్త ఏసీఏ కమిటీ, వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ స్థాయిని పెంచేందుకు విస్తృతమైన ప్రణాళికలు రూపొందించింది.
-
Home
-
Menu