అమెరికా-భారత్ సంబంధాలకు ముప్పు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను మరోసారి భారీగా పెంచబోతున్నామని ప్రకటన చేశారు. రాబోయే 24 గంటల్లోనే ఈ చర్యలను అమలులోకి తీసుకురావాలని ఆయన హెచ్చరించారు. దీనికి ప్రధాన కారణంగా భారత్–రష్యా మధ్య జరుగుతున్న చమురు ఒప్పందాలే ఆయన పేర్కొన్నారు. భారతదేశం రష్యా నుండి భారీగా చమురును దిగుమతి చేసుకుంటోందని, ఇది రష్యా యుద్ధ యంత్రానికి ఇంధనం పోసే చర్యగా మారుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా విధానాలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. "రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు కావాల్సిన ఆర్థిక వనరులను చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ అందిస్తోంది అని, ఇది పరోక్షంగా యుద్ధాన్ని ప్రోత్సహించడమే,అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంపై సుంకాలను పెంచకుండా వదిలిపెట్టలేమని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా తదుపరి ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయన్న దానిపై అనేక ఊహాగానాలకు దారితీశాయి. భారత్‌తో అమెరికా వ్యాపార సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-
Home
-
Menu