APM టెర్మినల్స్‌తో ఏపీకి భారీ పెట్టుబడి

APM టెర్మినల్స్‌తో ఏపీకి భారీ పెట్టుబడి
X
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మెర్స్క్ గ్రూప్‌కి చెందిన APM టెర్మినల్స్ ఏపీలో ఆధునిక ఓడరేవులు, టెర్మినల్స్ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌లో మరో పెద్ద అంతర్జాతీయ కంపెనీకి పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కంటెయినర్లపై కనిపించే మెర్స్క్ (Maersk) గ్రూప్‌లో భాగమైన APM టెర్మినల్స్ ఇప్పుడు ఏపీలోకి అడుగుపెడుతోంది. ఈ సంస్థ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగింది.

APM టెర్మినల్స్ 2004 నుంచే భారతదేశంలో పనిచేస్తోంది. గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్, మహారాష్ట్రలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (JNPA) వద్ద ఈ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంటెయినర్, బల్క్ హ్యాండ్లింగ్‌లో సామర్థ్యం పెంచడంలో మెర్స్క్ ముందంజలో ఉంది.

ఈ కొత్త ఒప్పందం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక ఓడరేవులు, టెర్మినల్స్ అభివృద్ధి చేయబడతాయి. దీని ద్వారా 8,000 నుండి 10,000 వరకు ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలుగుతాయి. రాష్ట్రంలో లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త టెర్మినల్స్ ఏర్పాటవుతాయి. సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత విలువైన ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతున్నారు. వాటిని పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.ఈ పెట్టుబడికి దారి చూపింది దావోస్‌లో జరిగిన ఒక సమావేశమని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. “మెర్స్క్ యజమానితో చంద్రబాబు పది నిమిషాల సమావేశమే ఈ ఒప్పందానికి దారి తీసింది” అని ఆయన ట్వీట్ చేశారు.

Tags

Next Story