అధికార కూటమి లో భాగంగా ఏడాది పూర్తిచేసుకున్న జనసేన పార్టీ

కూటమి ప్రభుత్వం లో భాగంగా అత్యధిక మెజార్టీ తో నెగ్గిన కాకినాడ రురల్ ఎంఎల్ ఏ పంతం నానాజీ గారికి , అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంలో కాకినాడ రురల్ నాయకులు ఘనంగా సత్కరించారు.నియోజకవర్గ అభివృధి కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీ అభ్యున్నతికి తన వంతు ప్రయత్నంగా ముందికి పోతున్నారు.
2019 కాకినాడ రురల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరుపున ఎం ఎల్ ఏ పోటీ చేసి విజయం వరించకపోయిన,జనసేన తరుపున అప్పటి అధికార పార్టీ వైసీపీ అరాచకాల ఫై ఎన్నో పోరాటాలు చేసి నియోజకవర్గ అభ్యున్నతికి,రూరల్ మండలాలలో తనకంటూ ఒక మార్కు సంపాదించుకున్న నాయకుడు నానాజీ గారు.
రురల్ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా తన మార్కు అభివృద్ధిని కనబరుస్తున్నారు.ఇటీవల నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేయించడం దగర్నుంచి, ఎన్నో ఏళ్లుగా పంట కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల రైతుకు నీరు అందక రైతుల కష్టాల్ని తెలుసుకుని, రైతు బాంధవుడిలా చివరి ఆయకట్టు రైతు కి కూడా నీరు ఇవ్వాలి అని సద్దుదేశం తో కాలువ పూడికతిత పనులు మొదలు పెట్టారు.
కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి అయిన శుభసందర్భంలో కాకినాడ రురల్ నియోజకవర్గం ఎంఎల్ ఏ పంతం నానాజీ , జనసేన నాయకులు కాకినాడ G కన్వెన్షన్ హాల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు.
-
Home
-
Menu