ఏపీతో సహా దేశంలో 4 కొత్త సేమి కండక్టర్ యూనిట్లు

దేశంలో నాలుగు కొత్త సేమి కండక్టర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇవి ఏపీ తో సహా ఓడిషా, పంజాబ్ రాష్ట్రాలలో ఏర్పాటు కానున్నాయి. ఈ యూనిట్ల కోసం మొత్తం రూ. 4,594 కోట్లు ఖర్చు అవుతాయి. విదేశాల నుండి దిగుమతులను తగ్గించి, దేశీయ తయారీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మెగా ఫ్యాబ్ 1డి ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. దీని వ్యయం రూ. 5,801 కోట్లు. అదేవిధంగా,అరుణాచల్ ప్రదేశ్ కు 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్రాజెక్టులకు కూడా అనుమతి లభించింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో సేమి కండక్టర్ ఎకో సిస్టమ్‌ను బలపరచడం, ఇతర ప్రాజెక్టులను ప్రోత్సహించడం ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం.మొత్తంగా రూ. 3,285 కోట్ల వ్యయంతో నాలుగు కొత్త యూనిట్లు ఏర్పడతాయి. ఇప్పటికే ఆరు సెమి కండెక్టర్ ఉన్న దేశంలో ఇప్పుడు మొత్తం 10 యూనిట్లతో, 2034 నాటికి సేమి కండక్టర్ తయారీలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది.ఈ నిర్ణయాలు దేశ సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి, అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం బలపడడానికి దోహదపడతాయని కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌కి సేమి కండక్టర్ ప్రాజెక్టు లభించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేష్ స్పందించారు. డిజిటల్ ఇండియా సర్క్యూట్ నెట్‌వర్క్‌లో ఏపీ కూడా చేరడం రాష్ట్రానికి గొప్ప అవకాశమని అన్నారు. సేమి కండక్టర్ తయారీ ప్రాజెక్టు మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి మోడీకి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈనిక్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ కింద కోయంబత్తూరులోని APACT కంపెనీ విస్తరించనుంది. 96 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో నెట్‌వర్క్ సిస్టమ్, సబ్ సిస్టమ్, సర్క్యూట్ డిజైన్, టెస్టింగ్ వంటి పనులు జరుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీలో హబ్‌గా మారుతుందని లోకేష్ తెలిపారు.
-
Home
-
Menu