OUకి 1000 కోట్లు హామీ – సీఎం రేవంత్

OUకి 1000 కోట్లు హామీ – సీఎం రేవంత్
X
విద్యారంగంపై భారీ ఖర్చులు – ప్రతి సంవత్సరం రూ.40,000 కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన హామీలు ఇచ్చారు. అవసరమైతే యూనివర్సిటీకి రూ.1000 కోట్లు వరకు నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌ స్థాయికి తీసుకెళ్లాలని తమ లక్ష్యం అని చెప్పారు. రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రతి సంవత్సరం దాదాపు రూ.40,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని ఆయన వివరించారు.ఈ సందర్బంగా ఆయన రూ.90 కోట్లతో నిర్మించిన రెండు కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అలాగే విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థుల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి ఈ సందర్శనతో ఒక విశేషం చోటు చేసుకుంది. గత 20 ఏళ్లలో OUకి వెళ్లి ప్రసంగించిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. ఇది విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించింది.ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు. OU మరియు తెలంగాణ ఒకటే అన్నట్టుగా అనుబంధం ఉంది" అని చెప్పారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తాము తరచుగా వస్తామని హామీ ఇచ్చారు.

మొత్తానికి, ఈ సందర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఉస్మానియా యూనివర్సిటీకి కొత్త ఉజ్వల భవిష్యత్తును సూచిస్తున్నాయి.

Tags

Next Story