డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ !

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన కొత్త సినిమా 'వైఫ్ ఆఫ్' త్వరలో డైరెక్ట్ గా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ముందుగా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, చివరి క్షణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడిస్తూ.. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. దివ్యశ్రీ, అభినవ్ మణికంఠ ప్రధాన పాత్రల్లో నటించగా, నిఖిల్, సాయిశ్వేత, వీర్, కిరణ్ వంటి నటులు ఇతర పాత్రల్లో మెరవనున్నారు.
'వైఫ్ ఆఫ్' కథ కథానాయిక అవని చుట్టూ తిరుగుతుంది. ఆమె తన బావతో ప్రేమలో పడుతుంది, అతనితో తన జీవితం హాయిగా సాగిపోతుందని అనుకుంటుంది. అయితే, వివాహం తర్వాత అతని నిజ స్వభావం బయట పడుతుంది. అవనిని హింసిస్తూ, అతని ప్రవర్తన దారుణంగా మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో అవని ఎలా ఎదుర్కొంటుంది? ఆమె జీవితంలో ఏమి జరుగుతుంది? అనేదే కథ. సస్పెన్స్‌తో నిండిన ఈ చిత్రం, ఆసక్తికరమైన కథనంతో ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
-
Home
-
Menu