‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీలో.. కానీ 8 నిమిషాలు మాయం!

X
సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల ఆనందానికి చిన్న ట్విస్ట్!. సాధారణంగా హిట్ సినిమాలు ఓటీటీలో అదనపు నిడివితో విడుదలవుతుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం 8 నిమిషాల నిడివి కోతతో జీ5లో అందుబాటులోకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
థియేటర్‌లో 2 గంటల 24 నిమిషాల నిడివితో ప్రదర్శితమైన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాలకు కుదించబడింది. ప్రత్యేకంగా వెంకటేష్ - మీనాక్షి చౌదరిల మధ్య ఫ్లాష్‌బ్యాక్ కి సంబంధించి అదనపు సన్నివేశాలు చేరుస్తారని ఊహించిన అభిమానులకు ఇది ఊహించని షాక్. అదనపు సన్నివేశాలు జోడించడం పక్కన పెట్టి.. ఉన్న సన్నివేశాలకే కత్తెర వేసినట్లు అనిపిస్తోంది. ఈ మార్పులపై చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Next Story
-
Home
-
Menu