ఓటీటీలోకి ‘వీర ధీర శూర’!

ఓటీటీలోకి ‘వీర ధీర శూర’!
X
విక్రమ్ కథానాయకుడిగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీర ధీర శూర’ మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో దుషారా విజయన్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించగా, సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించాడు.

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్‌కు ఈ చిత్రం కొంత ఊరటను తెచ్చినట్టు చెప్పాలి. తెలుగులో పెద్దగా ఆడకపోయినా.. తమిళంలో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక దుషారా విజయన్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. లేటెస్ట్‌గా ‘వీర ధీర శూర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.

ఈ సినిమాలో విక్రమ్ కాళీ పాత్రలో సాదాసీదా జీవితం గడుపుతూ, కిరాణా షాప్ నడుపుతూ కనిపిస్తాడు. అయితే అతని మునుపటి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని అనివార్య కారణాల వలన మళ్లీ గత జీవితంలోకి వెళ్లాల్సి వస్తోంది. అప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనేది కథ.

Tags

Next Story