ఓటీటీలో వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీస్.. వెరైటీ వెబ్ సిరీస్ ఇవే !

ఓటీటీలో వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీస్.. వెరైటీ వెబ్ సిరీస్ ఇవే !
X

ఈ ఏడాది వాలెంటైన్‌ డే సందర్భంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ కు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 లాంటి ప్రముఖ ఓటీటీల్లో రొమాన్స్, థ్రిల్లర్, కామెడీ జోనర్‌లలో వినోదాన్ని అందించే సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ జాబితాలో ధూమ్ ధామ్, లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్, సమ్మేళనం, మార్కో, ప్యార్ టెస్టింగ్ లాంటి ఆసక్తికరమైన కంటెంట్‌ అందుబాటులోకి రానున్నాయి.

మార్కో - సోనీలివ్

మలయాళ అగ్రనటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మార్కో ఫిబ్రవరి 14న సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో భారీ స్పందన పొందిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలో విడుదల కానుండటంతో, రొమాన్స్ కంటే యాక్షన్‌ను ఆస్వాదించాలనుకునేవారికి మంచి ఎంపికగా మారింది.

సమ్మేళనం - ఈటీవీ విన్

ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా సమ్మేళనం అనే కొత్త చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ మూవీ గురించి ఇంకా స్పష్టమైన వివరాలు బయటకు రాకపోయినా, పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.

ధూమ్ ధామ్ - నెట్‌ఫ్లిక్స్

ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ జంటగా నటించిన ధూమ్ ధామ్ క్రైమ్ థ్రిల్లర్ , కామెడీ మిళితమైన సినిమా. హనీమూన్ రోజే ఓ కొత్త జంట డ్రగ్స్ మాఫియా చేతిలో చిక్కుకుంటే ఏం జరుగుతుందనే కథాంశంతో ఈ మూవీ రూపొందించబడింది. ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ప్యార్ టెస్టింగ్ - జీ5

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కూడా తమ మనసుకు నచ్చినట్లు సంబంధం ఎలా ఉండాలనే అంశాన్ని కేంద్రంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ప్యార్ టెస్టింగ్. ప్రేమ, నమ్మకం, పెళ్లి సంబంధాలపై ఆసక్తికరమైన కథనాన్ని అందించనున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ - హాట్‌స్టార్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అనే కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. మలయాళ నటుడు అజు వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ తెలుగు, మలయాళంతో పాటు మరో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. వాలెంటైన్స్ డే సమయంలో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమను, వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఓటీటీ కంటెంట్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుంది.

Tags

Next Story