ఒకే ఓటిటి లోకి కీర్తి సురేష్ రెండు సినిమాలు!

ఒకే ఓటిటి లోకి కీర్తి సురేష్ రెండు సినిమాలు!
X

రీసెంట్ గా కీర్తి సురేష్ వివాహ బంధంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌తో గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఆమె వివాహం ఘనంగా జరిగింది. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే , సినిమాలపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలని కీర్తి నిర్ణయించుకుంది.

2025 లో తెలుగు, తమిళ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాల ద్వారా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఆమె కథానాయికగా నటించిన తమిళ సినిమాలు రివాల్వర్ రీటా, కన్నివేది త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడవడంతో మరింత ఆసక్తి నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాల డిజిటల్ రైట్స్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

రివాల్వర్ రీటా యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. జేకే చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ యువతి క్రైమ్ వరల్డ్‌లోకి ఎలా ప్రవేశించిందనేది ప్రధాన కథాంశంగా ఉంటుంది. కీర్తి ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో కనిపించనుంది. రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్‌లే, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటించారు.

కన్నివేది థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. గణేష్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఓ మర్డర్ మిస్టరీని ఆమె ధైర్యసాహసాలతో ఎలా ఛేదించిందన్నది ప్రధాన కథ. అజయ్ ఘోష్, వీజే రక్షణ్ కీలక పాత్రల్లో నటించారు.

ఇరు సినిమాల షూటింగ్ పూర్తయి చాలా రోజులయ్యింది. థియేట్రికల్ రిలీజ్‌పై స్పష్టత లేకపోవడంతో ఇవి నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రివాల్వర్ రీటా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, కన్నివేది కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Tags

Next Story