వచ్చేనెల్లో నెట్ ఫ్లిక్స్ లోకి ‘థగ్ లైఫ్’

వచ్చేనెల్లో నెట్ ఫ్లిక్స్ లోకి ‘థగ్ లైఫ్’
X
నెట్‌ఫ్లిక్స్ సంస్థ తగ్ లైఫ్ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 110 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. ఇది ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ డీల్ అని చెప్పొచ్చు.

లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. మూడు దశాబ్దాల తర్వాత “తగ్ లైఫ్” సినిమాతో మళ్లీ జోడీ కట్టారు. వీళ్ల మునుపటి కల్ట్ క్లాసిక్ “నాయకన్” తర్వాత వాళ్ళ కాంబోలోని మరో సినిమా ఇదే. “నాయకన్” అప్పట్లో ఇండియన్ సినిమాలో ఒక ఐకానిక్ మైలురాయిగా నిలిచింది. కానీ “తగ్ లైఫ్” మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

బాక్సాఫీస్ వద్ద “తగ్ లైఫ్” ఘోరంగా ఫెయిల్ అవడంతో కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరూ షాక్‌లో ఉన్నారని టాక్. ఈ సినిమాను వీళ్లిద్దరూ కలిసి నిర్మించారు కాబట్టి, ఆర్థికంగా వచ్చిన నష్టం కూడా భారీగానే ఉంది. ఈ నష్టాలను కవర్ చేసేందుకు, టీమ్ ఇప్పుడు ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాను త్వరగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయడం. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు.. ఈ సినిమా ఎనిమిది వారాల వరకు ఓటీటీలోకి రాదని, థియేటర్ ఎగ్జిబిటర్లకు గట్టిగా హామీ ఇచ్చారు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్లాన్‌ను మార్చేశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 110 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. ఇది ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ డీల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించాడు. సింబు అతని ప్రొటీజ్‌గా, త్రిష అతని లవర్‌గా, అభిరామి అతని వైఫ్‌గా నటించారు. స్టార్ కాస్ట్ బలంగా ఉన్నా, సినిమా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. మొత్తంగా, “తగ్ లైఫ్” ఒక భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రిలీజ్‌తో కొంతైనా రికవరీ అవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

Tags

Next Story