ఆకట్టుకుంటున్న 'అనగనగా'!

ఆకట్టుకుంటున్న అనగనగా!
X
టాలెంట్‌కి తగిన స్థాయిలో హిట్లు లేకపోయినా, అక్కినేని వారి మనవడు సుమంత్‌ కథల ఎంపికలో విలక్షణతను చాటుతూనే ఉన్నాడు. వైవిధ్యభరిత కథలతో ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వెళుతున్నాడు.

టాలెంట్‌కి తగిన స్థాయిలో హిట్లు లేకపోయినా, అక్కినేని వారి మనవడు సుమంత్‌ కథల ఎంపికలో విలక్షణతను చాటుతూనే ఉన్నాడు. వైవిధ్యభరిత కథలతో ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వెళుతున్నాడు.సుమంత్ తాజా ప్రయత్నం 'అనగనగా' ఓటిటి ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతూ, ఓ మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా ప్రశంసలు దక్కించుకుంటుంది.

కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలపై పడే ఒత్తిడిని, మార్కుల మోతలో మానసికంగా ఎదుర్కొంటున్న వాస్తవాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ సన్నీ సంజయ్. ఈ మూవీలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్‌గా సుమంత్‌ చూపించిన అభినయం ఆకట్టుకుంటుంది.

తెలుగులో ఇటీవలి కాలంలో అరుదుగా కనిపించే భావోద్వేగ ప్రధానమైన సినిమా ఇది. స్క్రీన్‌ ప్లే కాస్త నెమ్మదిగా ఉన్నా, ప్రతి సన్నివేశం వెనుక ఉద్దేశం బాగుంది. మార్కులు మాత్రమే కాదు, విలువలు కూడా పిల్లల్లో పెరగాలి అనే సందేశం ఈ సినిమాని ఓ విలువైన ప్రయత్నంగా నిలబెడుతుంది.



Tags

Next Story