క్రేజీ వెబ్ సిరీస్ సీజన్ 3 షూటింగ్ పూర్తి !

క్రేజీ వెబ్ సిరీస్  సీజన్ 3 షూటింగ్ పూర్తి !
X
"ది ఫ్యామిలీ మాన్ 3" ఈ దీపావళికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేర్లు రాజ్ అండ్ డీకే. ఈ తిరుపతి కుర్రాళ్లు ప్రస్తుతం ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. ప్రత్యేకంగా, "ది ఫ్యామిలీ మాన్" వెబ్ సిరీస్‌తో వీరి క్రేజ్ అమాంతం పెరిగి ఆకాశాన్ని తాకింది. ఈ ఫ్రాంఛైజీ రెండు సీజన్లు విజయ వంతంగా పూర్తి చేసిన తర్వాత.. ఇటీవల ‘సిటాడెల్’ ఇండియన్ రీమేక్ "హనీ బన్నీ" తో కూడా మరోసారి ప్రేక్షకులను మెప్పించారు.

ఇప్పుడు "ది ఫ్యామిలీ మాన్ 3" షూటింగ్‌ను పూర్తి చేసి విడుదలకు సిద్ధమవడం ద్వారా మరో కీలక మైలురాయిని సాధించారు. ఇటీవల షూటింగ్ ముగింపు వేడుకలో పాల్గొన్న రాజ్ అండ్ డీకే, ఈ ప్రాజెక్ట్ తమ కెరీర్‌లో అత్యంత కష్టమైనదిగా అభివర్ణించారు. “ఈ సీజన్ కోసం ఎంతో శ్రమించాం. చివరి వరకు మాతో నిలిచిన నటీనటులకు, టీమ్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు,” అని వ్యాఖ్యానించారు.

"ది ఫ్యామిలీ మాన్ 3" ఈ దీపావళికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. మే 2024లో మొదలైన ఈ సీజన్ షూటింగ్, నాగాల్యాండ్ సహా పలు చోట్ల కీలక షెడ్యూళ్లను పూర్తి చేసింది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ భాజ్‌పేయి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థకి కల్పిత విభాగం అయిన థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాన్‌గా ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ సీజన్‌లో ఆసక్తికరంగా చూపించనున్నారు.

ఈ సీజన్‌లో మనోజ్ భాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి (సుచిత్ర తివారీ), షరీబ్ హష్మి (జెకె తల్పాడే), ఆశ్లేష ఠాకూర్ (ధృతి తివారీ), వేదాంత్ సిన్హా (అథర్వ్ తివారీ) వంటి పాత తారాగణం కనిపించనున్నారు. గుల్ పనాగ్ కూడా ఈసారి కీలక పాత్రలో చేరారు. సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే కలిసి ఈ సీజన్ కథను రాశారు.

Tags

Next Story