‘ది ఫ్యామిలీ మాన్ 3’ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

‘ది ఫ్యామిలీ మాన్ 3’ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
X
‘ది ఫ్యామిలీ మాన్’ మూడో సీజన్ 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.

మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మాన్’ వెబ్ సిరీస్‌కి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే రెండు సీజన్లు ఘన విజయాన్ని సాధించగా.. ఇప్పుడు మూడో సీజన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే... ఈ సీజన్ విడుదల తేదీపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ‘ది ఫ్యామిలీ మాన్’ మూడో సీజన్ 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. 2025 ఐపీఎల్ మార్చి 22న ప్రారంభమై.. మే 25న ముగియనుంది. గత సీజన్ల విడుదల ట్రెండ్‌ను పరిశీలిస్తే... మేకర్స్ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

అయితే, దీపావళి 2025లో సిరీస్‌ను విడుదల చేసే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కానీ.. దీపావళి సమయంలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి కాబట్టి.. పోటీని తగ్గించుకునేందుకు మేకర్స్ ఐపీఎల్ అనంతరం సిరీస్‌ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీపావళి 2025లో కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న మ్యూజికల్ రొమాన్స్ చిత్రం.. అలాగే ఆయుష్మాన్ ఖురానా - రష్మిక మందన్న జంటగా వస్తున్న ‘థామా’ సినిమా ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి.

ఇక ఫ్యామిలీ మేన్ మూడో సీజన్‌లో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా చేరారు. అతడి పాత్ర మనోజ్ బాజ్‌పేయి నటించిన శ్రీకాంత్‌కి రైవలరీ పాత్రగా ఉండబోతోందట. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని కలిగిస్తాయని అంచనా. ఇదే విషయాన్ని జైదీప్ అహ్లావత్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మేకర్స్, స్క్రిప్ట్, దర్శకత్వంపై ప్రశంసలు గుప్పించారు.

‘ది ఫ్యామిలీ మాన్ 3’ షూటింగ్ 2025 జనవరిలోనే పూర్తయిందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. రాజ్ అండ్ డికే ద్వయం దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మాన్’ మొదటి సీజన్ 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాగా, రెండో సీజన్ 2021లో విడుదలైంది. ఇప్పుడు, మూడో సీజన్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story