సెకండ్ సీజన్ విషయంలో జాగ్రత్తలు !

సెకండ్ సీజన్ విషయంలో జాగ్రత్తలు !
X
మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. కానీ కథా కథనాల బోల్డ్‌నెస్, తెలుగు డబ్బింగ్‌లో బూతుల కారణంగా విమర్శలు కూడా ఎదురయ్యాయి.

విక్టరీ వెంకటేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్‌ ‘రానా నాయుడు’. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. కానీ కథా కథనాల బోల్డ్‌నెస్, తెలుగు డబ్బింగ్‌లో బూతుల కారణంగా విమర్శలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా వెంకటేష్‌కి ఫ్యామిలీల్లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా.. కుటుంబ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను చూడటం ప్రారంభించినప్పటికీ.. ఫస్ట్ ఎపిసోడ్‌కే కట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ విమర్శలు దర్శక నిర్మాతల దృష్టికి వెళ్లాయి. అందుకే సీజన్ 2లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా వెంకటేష్ దీనిపై మాట్లాడాడు. ఓటీటీల కారణంగా బూతులు పెరుగుతున్నాయని బుల్లిరాజు క్యారెక్టర్ ద్వారా చెప్పించటం చర్చనీయాంశమైంది. అందుకే సీక్వెల్ కోసం ద్వందార్థాలు, బోల్డ్ సీన్ల డోస్ తగ్గించామని వెంకటేష్ స్పష్టం చేశారు.

‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తయింది.. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇంకా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ ఉంటుందని భావిస్తున్నప్పటికీ.. స్లాట్ ఇంకా ఖరారు కాలేదు. వెంకటేష్, రానా పాత్రలతో పాటు మిగిలిన ముఖ్య పాత్రలన్నీ కొనసాగనున్నాయి. ఈ సారి సీరీస్‌కి హోమ్లీ టచ్ ఇస్తారని హామీ ఇచ్చారు. ఇది అభిమానుల్లో కొత్త నమ్మకాన్ని కలిగిస్తోంది.

Tags

Next Story