సౌరవ్ గంగూలీ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడా?

ఇండియాలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు. అది ఓ మతం. విరాట్ కోహ్లీ 270 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉండగా, ఎంఎస్ ధోనీ 44 మిలియన్ మంది అభిమానులను సంపాదించుకున్నారు. క్రికెట్ స్టార్స్ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ లో బిజీగా ఉంటారు కానీ, సినిమాల్లో నటించడం లేదా కెమియో రోల్స్ చేయడం చాలా అరుదు. అయితే ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ సారధి సౌరభ్ గంగూలీ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే కోల్‌కతాలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో గంగూలీ కెమియో చేసే అవకాశం ఉందని సంజ్ఞలతో సూచించడంతో ఈ ఊహాగానాలకు ఊతమొచ్చింది. ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’.. 2000ల కాలంలో కోల్‌కతాలో జరిగిన క్రైమ్, పాలిటిక్స్ నేపథ్యంగా సాగనుంది. ప్రోసెంజిత్ ఛటర్జీ, జీత్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఇప్పుడు దాదా నటిస్తాడనే ఊహాగానాలు అభిమానులను మరింత ఉత్సాహపరిచాయి.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా vs పాకిస్థాన్’ డాక్యుమెంటరీ ఇప్పటికే క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. ఇప్పుడు గంగూలీ ఓటీటీ రంగంలో అడుగుపెడతాడా అనే విషయం ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేపుతోంది. అయితే గంగూలీ నిజంగా ఖాకీ వెబ్‌సిరీస్‌లో కనిపిస్తాడా? లేక అది కేవలం చిన్న కెమియోనా లేదా ముఖ్యమైన పాత్రనా? ఎలాంటి పాత్ర అయినా సరే.. గంగూలీ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, బెంగాల్ ప్రేక్షకులు ఖచ్చితంగా దీన్ని ఆసక్తిగా వీక్షించబోతున్నారు.
-
Home
-
Menu