ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైన సోను సూద్ ‘ఫతే’

ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైన సోను సూద్ ‘ఫతే’
X

ప్రఖ్యాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, అనేక భాషల్లో సినిమాలు చేసి, సేవా కార్యక్రమాల్లో భాగం అయిన సోను సూద్, ఇప్పుడు దర్శకత్వం వహించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘ఫతే’ జనవరి 10, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాను పెద్ద తెరపై చూడలేకపోయినవారి కోసం... ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో దర్శకుడిగా మారిన సోను సూద్, తన తొలి సినిమా ‘ఫతే’ ను ప్రేక్షకులకు అందించాడు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఇంట్లోనే ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది "ఫతే" ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ ప్రకటనను చేస్తూ, సోను సూద్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో కనిపించే ఒక ప్రత్యేక క్లిప్‌ను విడుదల చేశారు. "న్యాయం కోసం పోరాటం చేసే ఒకే ఒక్క పేరు ఫతే! అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

సోను సూద్ దర్శకత్వం వహించిన ‘ఫతే’ ఒక మాజీ స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ కథ. ఆయన పంజాబ్‌లో సాధారణ జీవితం గడుపుతూ, ఒక డెయిరీ ఫార్మింగ్ సూపర్వైజర్‌గా పని చేస్తుంటాడు. అయితే, ఊహించని పరిస్థితుల్లో, ఒక గ్రామ బాలిక సైబర్ క్రైమ్ మాఫియా సిండికేట్ బాధితురాలిగా మారుతుంది. దీంతో, కథానాయకుడు తన యుద్ధ కవచాన్ని తిరిగి ధరించి, న్యాయం కోసం పోరాటం ప్రారంభిస్తాడు. ఈ పోరాటంలో అతడికి తోడుగా ఒక ఎథికల్ హ్యాకర్ సహాయం చేస్తుంది.

ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సోను సూద్ ప్రధాన పాత్రలో ఫతే సింగ్‌గా నటించగా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘ఖుషీ శర్మ’ అనే హ్యాకర్‌గా కనిపిస్తుంది. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రాన్ని అజయ్ ధామా సహనిర్మాతగా వ్యవహరించాడు. అదనంగా, నసీర్‌ద్దీన్ షా, విజయ్ రాజ్, దిబ్యేందు భట్టాచార్య వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

Tags

Next Story