ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ చిత్రం

వరలక్ష్మి శరత్‌కుమార్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ‘శివంగి’ ఈ వారంలో డిజిటల్ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు పొందినప్పటికీ... ఇప్పుడు దీని ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘శివంగి’ చిత్రం ఏప్రిల్ 17 నుంచి అంటే ఈ రోజు నుంచే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. ఓటీటీ సంస్థ ఆహా తమిళ్ వారి ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. "ఇది థ్రిల్లర్ టైమ్ గైస్... ‘శివంగి’ మూవీ ఏప్రిల్ 17 నుంచి ఆహా తమిళ్ లో ప్రీమియర్ ప్రారంభం" అని ఆహా తమిళ్ పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో ఆనంది పోషించిన పాత్ర పేరు సత్యభామ. ఆమె ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ వర్క్ ప్లే్స్ హెరాస్ మెంట్, సామాజిక విమర్శలతో పోరాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆమెపై హత్య ఆరోపణలు వచ్చినప్పుడు పరిస్థితులు మరింత విషమంగా మారతాయి. తదుపరి దర్యాప్తులో, సత్యభామ ఒక పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర) ఎదుట తన కథను వివరిస్తుంది. ఒకే రోజు జరిగిన అనేక సంఘటనలను ఆమె చెబుతుంది. ఈ చిత్రం ఆమె ఒకటి తర్వాత ఒకటి ఎదుర్కొన్న సంక్షోభాలను ఎలా అధిగమించిందన్న దానిపై దృష్టి పెడుతుంది.
కథనం ప్రధానంగా ఫోన్ కాల్స్ ఆధారంగా కొనసాగుతుంది ఈ సినిమా. అనేక పాత్రలు స్క్రీన్‌పై ప్రత్యక్షంగా కనిపించవు. వారి ఉనికిని సంభాషణల ద్వారా, ఆంబియెంట్ శబ్దాల ద్వారా సూచిస్తారు. సత్యభామ చెబుతున్న కథనం ద్వారా హత్య ఆరోపణల వెనుక నిజం మెల్లమెల్లగా బయటపడుతుంది. ‘శివంగి’ చిత్రంలో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు జాన్ విజయ్, డాక్టర్ కోయ కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. దేవరాజ్ భరణి ధరణ్ రచన మరియు దర్శకత్వం వహించగా, నరేష్ బాబు పంచుమర్తి ఈ సినిమాను నిర్మించారు.
-
Home
-
Menu