కొత్త మలుపు తిరిగిన సమంత కెరీర్ !

కొత్త మలుపు తిరిగిన సమంత కెరీర్ !
X
బాలీవుడ్ వర్గాల్లో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె వరుసగా ప్రముఖ హిందీ నటులతో కలిసి పని చేసే అవకాశాలను పొందుతోంది.

ఒకప్పుడు సౌత్ లో క్రేజీ హీరోయిన్ సమంత. దాదాపు ఒక దశాబ్దం క్రితం.. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో అగ్రహీరోల సరసన నటించే టాప్ మోస్ట్ హీరోయిన్ గా నిలిచింది. కానీ.. కాలంతో పాటు పరిస్థితులు కూడా మారాయి. గత కొంతకాలంగా ఆమె కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ ఫాల్ అయినట్టు కనిపిస్తోంది. అయితే, బాలీవుడ్ వర్గాల్లో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె వరుసగా ప్రముఖ హిందీ నటులతో కలిసి పని చేసే అవకాశాలను పొందుతోంది.

రీసెంట్ గా సమంత "సిటాడెల్" అనే వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఇందులో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించాడు. తాజా సమాచారం ప్రకారం... ఇప్పుడు సమంత మరో హిందీ ఓటీటీ సిరీస్ కోసం కీలక పాత్రకు ఎంపికయినట్టు తెలుస్తోంది. ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్‌సిరీస్‌ పేరు "రక్త బ్రహ్మాండ". దీన్ని "తుంబాడ్" ఫేమ్ రాహుల్ అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌కి ప్రత్యేక ఆకర్షణ రాజ్ అండ్ డీకే ప్రముఖ నిర్మాతలు, క్రియేటర్స్. ఇప్పటికే సమంత వీరి దర్శకత్వంలో కొన్ని ప్రాజెక్టులలో పని చేసింది కాబట్టి.. వారి వర్కింగ్ స్టైల్ పై సామ్ కు మంచి అవగాహన ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుందని సమాచారం. మొత్తానికి సామ్.. థియేట్రికల్ సినిమాల నుంచి దూరంగా ఉంటూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను నమ్ముకుని కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది.

Tags

Next Story