‘రానా నాయుడు-2’ స్ట్రీమింగ్ డేట్!

‘రానా నాయుడు-2’ స్ట్రీమింగ్ డేట్!
X
దగ్గుబాటి బాబాయ్, అబ్బాయిలు వెంకటేష్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు‘ సీరీస్ ఇండియా వైడ్ మంచి ఆదరణ దక్కించుకుంది.

దగ్గుబాటి బాబాయ్, అబ్బాయిలు వెంకటేష్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు‘ సీరీస్ ఇండియా వైడ్ మంచి ఆదరణ దక్కించుకుంది. కరణ్ అన్షుమన్, సువర్ణ్ వర్మ సంయుక్త దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సీరీస్ మొదటి సీజన్ తో సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ ను తీసుకొస్తున్నారు.

ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచిన ‘రానా నాయుడు‘ సీజన్ 2 లేటెస్ట్ గా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘రానా నాయుడు 2‘ స్ట్రీమింగ్ కాబోతుంది. వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా మరోసారి మురిపించనున్న ఈ సీజన్ లో యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెబుతున్నారు మేకర్స్.



Tags

Next Story