చాలా లేట్ గా ఓటీటీలోకి పూజా హెగ్డే హిందీ చిత్రం

తాజాగా బాలీవుడ్‌లో పూజా హెగ్డే నటించిన "దేవా" చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ హిందీ సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు నెలల తరువాత.. మార్చి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, మలయాళ హిట్ "ముంబై పోలీస్"కు రీమేక్‌గా రూపొందింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై, తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. తక్కువ వసూళ్లు, విభాగాలవారీగా నెగటివ్ రివ్యూల కారణంగా చిత్రానికి నిరాశాజనకమైన ఫలితం దక్కింది.
క్లైమాక్స్, స్క్రీన్‌ప్లే పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, షాహిద్ కపూర్ నటన ప్రశంసలు అందుకుంది. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, దాదాపు 60 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్, విశాల్ మిశ్రా సంగీతాన్ని అందించారు. "ముంబై పోలీస్" చిత్రాన్ని కూడా రోషన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేశాడు. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే "దేవా"లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా, మలయాళంలో హీరో గే క్యారెక్టర్‌గా ఉండగా, హిందీ రీమేక్‌లో ఆయన పాత్రను విభిన్నంగా మలిచారు. ఈ సినిమా తెలుగు రీమేక్ "హంట్" కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే, సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ బిజీగా మారింది. "దేవా" తరువాత బాలీవుడ్‌లో "హై జవానీ తో ఇష్క్ హోనా హై"లో నటిస్తోంది. తమిళంలో వరుసగా నాలుగు సినిమాలు ఒప్పుకుంది. సూర్య "రెట్రో", దళపతి విజయ్ "జన నాయగన్", "కాంచన 4", రజనీకాంత్ "కూలీ" చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనుంది.
-
Home
-
Menu