ఓటీటీలోకి ‘కొత్త బంగారులోకం’ బ్యూటీ సినిమా !

ఓటీటీలోకి ‘కొత్త బంగారులోకం’ బ్యూటీ సినిమా !
X
"ఇది ఎగుడుదిగుడుగా సాగే రైడ్ కాబోతోంది" అనే క్యాప్షన్‌తో విడుదలైన టీజర్ ఇప్పటికే మంచి ఆసక్తిని కలిగించింది.

తెలుగువారికి "కొత్త బంగారులోకం" సినిమాతో పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ తాజాగా మరో బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పేరు ‘ఊప్స్ అబ్ క్యా’. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఓ యువతి అనుకోకుండా గర్భం దాల్చిన పరిస్థితుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.

‘ఊప్స్ అబ్ క్యా’ ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జనవరి 23న హాట్‌స్టార్ ఒక ప్రత్యేకమైన టీజర్‌ను విడుదల చేస్తూ ప్రకటించింది. "ఇది ఎగుడుదిగుడుగా సాగే రైడ్ కాబోతోంది" అనే క్యాప్షన్‌తో విడుదలైన టీజర్ ఇప్పటికే మంచి ఆసక్తిని కలిగించింది.

50 సెకన్ల టీజర్‌లో కథ క్లియర్‌గా చూపించారు. ఓ అమ్మమ్మ తన మనవరాలికి "మానం పిగ్గీ బ్యాంక్ లాంటిది, పగిలితే మళ్లీ అతకదు" అని చెప్పే సన్నివేశంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత, పెళ్లి కాకుండానే గర్భవతిగా తేలిన యువతి సతమతమవుతుంది. బాయ్‌ఫ్రెండ్ ఉన్న కారణంగా, ఇంట్లో వాళ్లు ఆమెను తప్పుబడతారు. కానీ తాను ఏ తప్పు చేయలేదని, గర్భం దాల్చడానికి కారణమేంటో తెలియదని యువతి చెబుతుంది.

తర్వాత కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు, పొరపాటున మరో మహిళకు చేయాల్సిన ప్రొసీజర్ ఆమెకు చేయడం వల్ల ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ అజాగ్రత్తతో షాక్ అయిన ఆమె, పరిస్థితిని ఎదుర్కొంటూ తాను గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటన్నది ఈ చిత్రంలో చూడవచ్చు.

Tags

Next Story