జీ5 వారి మలయాళ వెబ్ సిరీస్ ‘కమ్మటం’

జీ5 తాజాగా ఒక కొత్త ఇన్వెస్టిగేటివ్ సిరీస్ "కమ్మటం" అనౌన్స్ చేసింది. ఇందులో సుదేవ్ నాయర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సిరీస్ ఆగస్టు 29న జీ5లో ప్రీమియర్ కానుంది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్... మలయాళ సిరీస్‌లకు తొలి అడుగు అని చెప్పాలి. 23 ఫీట్ ప్రొడక్షన్స్ సమర్పణలో, షాన్ తులసీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్.. త్రిస్సూర్‌లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందింది.
ఈ సంఘటన త్రిస్సూర్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైనది అని, రాష్ట్రాన్ని మరియు దేశాన్ని కదిలించినదిగా చిత్రీకరణ బృందం వర్ణించింది. "కమ్మటం"లో జిన్స్, అజయ్ వాసుదేవ్, జియో బేబీ, అఖిల్ కావలయూర్, శ్రీరేఖ, జోర్డీ పూంజా, అరుణ్ సోల్ తదితరులు నటిస్తున్నారు. కథ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ (సుదేవ్) సామ్యూల్ ఉమ్మన్ అనే ప్లాంటర్ మరణం గురించి దర్యాప్తు చేసే అంశంపై ఆధారపడి ఉంటుంది.
‘‘జీ5లో తొలి మలయాళ ఒరిజినల్ 'కమ్మటం'లో భాగమవడం నిజంగా ప్రత్యేకం. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బ్రూటల్ మర్డర్ పై సాగే లోతైన అన్వేషణ. ఈ పాత్ర నన్ను మానసికంగా, భావోద్వేగంగా సవాలు చేసింది. ప్రతి చిన్న సైగలో శ్రద్ధ అవసరం. షాన్ అండ్ మొత్తం టీమ్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. జీ5 వంటి ప్లాట్‌ఫామ్‌లో మలయాళ కంటెంట్‌కు ఇది ఒక ముఖ్యమైన ఆరంభం.. ఇది స్థిరంగా అర్థవంతమైన, ఆధారమైన కథనాలను ప్రోత్సహిస్తుంది..." అని ఈ సిరీస్ హీరో సుదేవ్ నాయర్ చెప్పాడు.
-
Home
-
Menu