ఆకట్టుకుంటోన్న నెట్‌ఫ్లిక్స్ కొత్త క్రైమ్ థ్రిల్లర్ 'డబ్బా కార్టెల్'

సాధారణ మధ్యతరగతి మహిళలు టిఫిన్ సర్వీస్ ప్రారంభించడమే ఈ కథకు పునాది. ముంబైలో ప్రసిద్ధి చెందిన డబ్బావాలా సేవల తరహాలో వీరు ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెడతారు. అయితే అనుకోకుండా డ్రగ్స్ అక్రమ రవాణాలో ఇరుక్కుపోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈ కేసులో ఫార్మా కంపెనీల ప్రమేయం కూడా బయటకు రావడం కథకు మరింత ఉత్కంఠను జోడిస్తుంది. కుటుంబ పరంగా, సామాజికంగా, చట్టపరంగా ఈ మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, అవి ఎలా దాటుకున్నారు అన్నదే ప్రధాన హైలైట్.
ఈ సిరీస్‌లో బాలీవుడ్ దిగ్గజ నటి షబానా అజ్మీ ప్రధాన పాత్ర పోషించగా, జ్యోతిక, షాలిని పాండే కీలక పాత్రలు పోషించారు. నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు మంచి మార్కులు వేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చాలా మంది దీనిని హాలీవుడ్ క్లాసిక్ 'బ్రేకింగ్ బాడ్' సిరీస్‌తో పోలుస్తున్నారు. సాధారణ మనుషులు అనుకోకుండా క్రిమినల్ ప్రపంచంలోకి వెళ్లడం, అక్కడ జరిగే సంఘటనలు ఆకట్టుకునేలా చూపించారు.
ప్రారంభంలో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేదు. దీంతో 'డబ్బా కార్టెల్' కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ విడుదల అనంతరం, కథనమే కాకుండా, ప్రదర్శన, కథనం, ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లే బలంగా ఉండటంతో ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది.
ప్రముఖ నిర్మాతలు ఫర్హాన్ అక్తర్ – రితేష్ సిద్వానీ ఈ వెబ్ సిరీస్‌ను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. రాబోయే రోజుల్లో 'డబ్బా కార్టెల్' మరింత ప్రజాదరణ పొందే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-
Home
-
Menu