ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘వార్2’

యష్ రాజ్ ఫిలిమ్స్ వారి భారీ బడ్జెట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఇందులో ఎన్.టి.ఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుని, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది.
అయితే.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ‘వార్ 2’ సినిమా రేపటి (అక్టోబర్ 9) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది.
ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. అశుతోష్ రాణా ముఖ్య పాత్రలో నటించారు. క్లైమాక్స్‌లో బాబీ డియోల్ అతిథి పాత్రలో కనిపించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రీతమ్, సంచిత్ బల్హారా, మరియు అంకిత్ బల్హారా సంగీత విభాగాన్ని నిర్వహించారు. మరి ఓటీటీ వీక్షకులను ‘వార్ 2’ ఎంతగా ఆకట్టు కుంటుందో చూడాలి.
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu
— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025
-
Home
-
Menu