డైరెక్ట్ ఓటీటీలోకి నీనా గుప్తా 'ఆచారి బా' మూవీ

బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాల నుంచి వెబ్ సిరీస్‌ల వరకు ఆమె తన పాత్రలతో చక్కటి ముద్రవేస్తూ వస్తున్నారు. ప్రెజెంట్ ఆమె ‘ఆచారి బా’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె పాత్ర ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నీనా గుప్తా, కబీర్ బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచారి బా’ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్‌తో పాటు ఈ కుటుంబ కథా చిత్రాన్ని జియో హాట్ స్టార్ వేదికగా ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2025 మార్చి 14 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతోంది.
‘ఆచారి బా’ ఓ కుటుంబ కథా చిత్రం. ఇందులో ప్రధాన పాత్రగా నీనా గుప్తా జైశ్నవిబెన్ అనోప్‌చంద్ వగడియా (ప్రేమగా బా అని పిలుస్తారు) అనే గుజరాతీ వృద్ధురాలి పాత్రను పోషించారు. జీవితమంతా ఇతరులను చూసుకుంటూ గడిపిన బాకు.. చాన్నాళ్లకు తొలిసారి తన కొడుకి ఇంటికి పిలుపు వస్తుంది. కానీ, ముంబైకి వెళ్లిన తరువాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితి ఆశ్చర్యకరంగా మారిపోతుంది. తాను కుటుంబ సభ్యులతో గడపడానికి వెళ్లాననుకున్న బాకు, వారు దార్జిలింగ్‌కు వెళ్ళేటప్పుడు కేవలం పెంపుడు కుక్కను చూసుకోవాలనే బాధ్యత మాత్రమే అప్పగిస్తారు.
ఆకస్మాత్తుగా ఒంటరితనంలో చిక్కుకున్న బా.. తన మనసుకు నచ్చిన పని అచ్చంగా ఇంట్లో చేసిన విధంగానే ఆవకాయల తయారీలో మళ్ళీ తల మునకలవుతుంది. ఆమె ఈ కొత్త ప్రయాణంలో ఎలా స్వతంత్రంగా తన స్థానం ఏర్పరుచుకుంటుంది? జీవితాన్ని కొత్తగా ఎలా అర్థం చేసుకుంటుంది అనేది మిగతా కథ. ఈ చిత్రంలో నీనా గుప్తాతో పాటు కబీర్ బేడీ, మానసి రచ్చ్, వత్సల్ శేఠ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, భావోద్వేగంతో కూడిన కుటుంబ అనుబంధాలను హృదయాన్ని తాకేలా చూపించే చిత్రంగా భావిస్తున్నారు.
-
Home
-
Menu