ఓటీటీలోకి రాబోతున్న ‘నరివేట్ట’ మలయాళ చిత్రం

మాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనాత్మక చిత్రంగా నిలిచిన హార్డ్-హిట్టింగ్ యాక్షన్-డ్రామా ‘నరివేట్ట’. థియేట్రికల్ రిలీజ్ లో విమర్శకుల నుండి అపూర్వమైన ప్రశంసలు అందుకున్న ఈ మూవీ .. జూలై 11 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. గొప్ప కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ.. తీవ్రమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
యువ దర్శకుడు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టిప్పుషన్, షియాస్ హసన్ సంయుక్తంగా ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై నిర్మించారు. మలయాళం సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు టోవినో థామస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో టోవినో తన కెరీర్‌లోనే అత్యంత శక్తివంతమైన పాత్రలో అదరగొట్టాడు. ఇది అతని నటనా ప్రతిభకు మరో గీటురాయిగా నిలవనుంది.
‘నరివేట్ట’ మూవీ ఒక గ్రిప్పింగ్ కాప్ డ్రామాగా తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన ట్రీట్ అని చెప్పాలి. ఈ సినిమా బలమైన కథాంశం, అద్భుతమైన సాంకేతిక విలువలతో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లే.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అదే మాయాజాలాన్ని సృష్టించనుంది. ‘నరివేట్ట’ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంక ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
-
Home
-
Menu