మోహన్ లాల్ తో చియాన్ విక్రమ్ ఢీ !

వినోద ప్రపంచంలో ఇప్పుడు వైవిధ్యం రాజ్యం చేస్తోంది. కొత్తరకం కథల్ని అందిస్తూ ఓటీటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహాలో ఇప్పుడు ఇద్దరు అగ్రతారల సినిమాలు ఒకే రోజున ఓటీటీ ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమయ్యాయి.
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, ప్రతిభావంతుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఎల్ 2: ఎంబురాన్’. ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఈ నెల 24న జియో హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరించబోతోంది అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్: పార్ట్ 2’ కూడా అదే రోజున, అంటే ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఒకే రోజున ఇద్దరు అగ్రతారలు తమ తమ సినిమాలతో ఓటీటీ ప్రపంచాన్ని హీటెక్కించేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. మోహన్‌లాల్ స్టైల్ లో మిస్టరీ, యాక్షన్ నడుస్తుంటే.. విక్రమ్ స్టైల్‌లో మాస్ మసాలా, ఎమోషన్ ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేయబోతున్నాయి. ఏదేమైనా, ఏప్రిల్ 24న ఓటీటీ ప్రేమికులకు వినోదాల పండగే అన్నమాట.
-
Home
-
Menu