‘మార్కో’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే !

‘మార్కో’  ఓటీటీలోకి వచ్చేది అప్పుడే !
X
కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన మార్కో సినిమా మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

గతేడాది విడుదలై మలయాళ సినీ పరిశ్రమలో చరిత్రకెక్కిన చిత్రం "మార్కో". ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఊపేసింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాక, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ అంచనాలకు మించి మంచి ఆదరణను పొందింది. ఈ నేపథ్యంలో "మార్కో" ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ సంస్థలన్నీ పోటీ పడ్డాయి.

చివరకు సోనీలివ్‌ ఈ చిత్రాన్ని అన్ని భాషల డిజిటల్‌ హక్కుల్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఏ చిత్రానికీ ఇంత రేటు పెట్టలేదని తెలుస్తోంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన "మార్కో" ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందుతుందనే ఆశతో సోనీలివ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ చిత్రాన్ని పిబ్రవరి మూడో వారంలో ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా.. షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా.. యుక్తి తరేజా, అభిమన్యు తిలకన్, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

జార్జ్‌ (సిద్దిఖ్) గోల్డ్ బిజినెస్‌లో తిరుగులేని వ్యాపారవేత్త. తన వ్యాపారాన్ని మరింతగా పటిష్టం చేయడానికి సిండికేట్‌ను ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహిస్తాడు. జార్జ్‌కి ఇద్దరు సోదరులు ఉంటారు. విక్టర్‌ (ఇషాన్ షౌకాత్) అనే అంధుడు, కానీ అత్యంత టాలెంటెడ్ వ్యక్తి. జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి మార్కో (ఉన్ని ముకుందన్‌). విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. ఆ తర్వాత.. సాక్షిగా ఉన్న విక్టర్‌ను కూడా ఆ ముఠా చంపేస్తుంది. ఈ విషయం విదేశాల్లో ఉన్న జార్జ్‌కు తెలియగానే.. అతని తమ్ముడు మార్కో హత్యకు సంబంధించిన నిజాలను వెలికితీసి.. హంతకులను మట్టుబెట్టాలని ప్రమాణం చేస్తాడు. విక్టర్‌ హత్యకు పథకం వెనుక ఉన్నవారు ఎవరు? వారిని మార్కో ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

Tags

Next Story