ఓటీటీలోకి రాబోతున్న మలయాళ థ్రిల్లర్ ‘రోంత్’

ఓటీటీలోకి రాబోతున్న మలయాళ థ్రిల్లర్ ‘రోంత్’
X
జులై 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.

జూన్ 13న థియేటర్లలో విడుదలై.. సరిగ్గా 39 రోజుల తర్వాత.. దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ నటించిన "రోంత్" మలయాళ పోలీస్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం జులై 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను రాసి, దర్శకత్వం వహించినది షాహి కబీర్. ఇది అతని రెండో దర్శకత్వ చిత్రం. మొదటి సినిమా "ఎల వీళా పూంచీర" తో కేరళ స్టేట్ అవార్డు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా గెలుచుకున్నాడు.

షాహి గతంలో "జోసెఫ్", "నాయాట్టు", "ఆఫీసర్ ఆన్ డ్యూటీ" చిత్రాలకు స్క్రిప్ట్ రాశాడు. షాహి మునుపటి చిత్రాల మాదిరిగానే "రోంత్" కూడా పోలీసుల జీవితాల్లోని ఆవేదనను చూపిస్తుంది. ఈ కథ అనుభవజ్ఞుడైన పోలీస్ (దిలీష్) మరియు కొత్తగా చేరిన రూకీ (రోషన్) చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరి మధ్య భావజాల విభేదాలు, తీవ్రమైన సామాజిక-రాజకీయ వ్యాఖ్యానంతో కథ నడుస్తుంది. థియేటర్లలో ఈ సినిమాకు ఎక్కువగా సానుకూల సమీక్షలు వచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు ప్రధాన నటుల నటనకు ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రంలో అరుణ్ చెరుకావిల్, లక్ష్మీ మీనన్, కృష కురుప్, జితిన్ పుతెంచెరి కీలక పాత్రల్లో నటించారు. సంగీతం అనిల్ జాన్సన్, సినిమాటోగ్రఫీ మనీష్ మాధవన్, ఎడిటింగ్ ప్రవీణ్ మంగళాత్ చేశారు. వినీత్ జైన్, రతీష్ అంబట్, రంజిత్ ఈవీఎం, జోజో జోస్ సంయుక్తంగా ఫెస్టివల్ సినిమాస్, జంగ్లీ పిక్చర్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags

Next Story