నేటి నుంచే ‘మహావతార్‌ నరసింహ’

నేటి నుంచే ‘మహావతార్‌ నరసింహ’
X
థియేటర్లలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న యానిమేషన్‌ మూవీ ‘మహావతార్‌ నరసింహ’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

థియేటర్లలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న యానిమేషన్‌ మూవీ ‘మహావతార్‌ నరసింహ’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనంగా మారింది.

శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని ఆధారంగా తీసుకొని కన్నడ దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది. యానిమేషన్‌ సినిమాలు కేవలం పిల్లల కోసమే అనుకునే అభిప్రాయాన్ని మార్చేసిన ఈ చిత్రం, ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తోంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈరోజు (సెప్టెంబర్‌ 19) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మహావతార్‌ నరసింహ’ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పైన కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.



Tags

Next Story